కామారెడ్డి అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 20 (అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అక్షర స్కూల్లో విద్యార్థినీలు బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి విద్యా సంస్థ ప్రాంగణంలో పెట్టి విద్యార్థినిలు తనదైన శైలిలో బతుకమ్మ సంబరాలు లో డాన్స్ లతో అలరించారు. విద్యార్థినిలు బతుకమ్మలను ఊరేగింపుగా పట్టణంలోని పలు విధులను తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అక్షర స్కూల్ ప్రిన్సిపాల్ సంగీత, ప్రవీణ్, రామ్మోహన్ రామ్మోహన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు.