లాభాల వాటా చెల్లించాలనీ ఈ నెల 24న గోలేటీ జీఎం ఆఫీసు ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష
సంగటిత అసంగటిత కార్మికులు పాల్గొనాలని ఎస్సిఎల్యూ టిఎన్టియూసి పిలుపు
బెల్లంపల్లి సెప్టెంబర్ 19(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ కార్మిక సంఘం టిఎన్టియుసి కార్యాలయంలో శుక్రవారం బెల్లంపల్లి ఏరియా టిఎన్టియుసి ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి టీ.మణి రామ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి కాలరీస్ సమస్త ప్రగతికి కార్మికులు పునాదులుగా నిలుస్తున్న సింగరేణి ఉద్యోగులు 72 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 69.06 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 96% టార్గెట్ ను చేరుకొని రికార్డ్ స్థాయి దిష్ప్యాచ్ ను నమోదు చేశారన్నారు.2024 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి సమస్త నికర లాభాలను ప్రకటించి సింగరేణి కార్మికుల లాభాలవాటై తక్షణమే ప్రకటన చేయాలని,అలాగే 40 శాతం లాభాల్లో భాగస్వామ్యం వాటాను కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు ప్రకటించి చెల్లించే తేదీని ఖరారు చేయాలని సింగరేణి కాలేజెస్ లేబర్ యూనియన్ టి ఎన్ టి యు సి నాయకులు సింగరేణి సిఎన్ఎండి కి విజ్ఞప్తి చేయడం జరిగింది.అలాగే నూతన ట్రాన్స్ఫర్ విధానం రద్దు,సొంత ఇంటి పథకం కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన చట్టం 26 వేల కంటే తగ్గకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సింగరేణిలో కూడా అమలు చేయాలని సింగరేణిలో పనులు అయిపోయినటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి క్వార్టర్స్ ను పర్మినెంట్ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు ఖాళీగాఉన్నటువంటి క్వార్టర్స్ ను అలాట్మెంట్ చేయాలి,కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతన అండర్ గ్రౌండ్ మైన్స్ ఇన్కంటాక్స్ రద్దు పెర్కాస్ పై అలా వెన్సులను డిస్మిస్ కార్మికులకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని పెండింగ్ సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ఈ నెల 24న గోలేటి జిఎం ఆఫీస్ ముందు టీఎన్టీయూసి ఆధ్వర్యంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని టిఎన్టియుసి నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీ. మనిరాంసింగ్ సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యదర్శి,ఉపాధ్యక్షులు గద్దల నారాయణ,టిఎన్టియూసి జిల్లా అధ్యక్షులు ఓ.జీవరత్నం,మందమర్రి ఏరియా కార్యదర్శి ఎం.వెంకటస్వామి, పాషా,డి.చంద్రమౌళి,పంతం యాదగిరి, గోలేటీ ఇంచార్జి గుర్రం గంగయ్య,ఎస్ ఎస్ పాండే,బొల్లు మల్లయ్య,గంగాధర్ గౌడ్,రాజయ్య,సి హెచ్ రమేష్,మేకల నర్సింగ్,మాసడి గోపాల్, బొల్లు సత్యనారాయణ,ఎం.ఎస్.రవికుమార్ నవీన్,తదితరులు పాల్గొన్నారు…