త్రాగునీరు సమస్యను పరిష్కరించండి
మంచినీరు రాక వారం గడుస్తుంది.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న
సంబంధిత అధికారులు.
బెల్లంపల్లి సెప్టెంబర్ 19(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అడా ప్రాజెక్టు నుండి సరఫర చేస్తున్న త్రాగునీరు రాక ఈరోజుకు వారం రోజులు అవుతుంది.ఈ సందర్బంగా ప్రజా స్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబాలా మహేందర్ మాట్లాడుతూ…సంబంధిత మున్సిపల్ ఏఈ ని సంప్రదించగా రిపేర్ జరుగుతుందని చెప్పారు,అలాగే మిషన్ భగీరథ ఏఈ నీ అడగండని చెప్పడం జరిగింది.ఈ యొక్క నీరు అందించడంలో పురపాలక సంఘం అధికారులు,మిషన్ భగీరథ అధికారులు,విఫలం అవుతున్నారనేది జగమెరిగిన సత్యం.త్రాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు,ఇప్పటికైనా నియోజకవర్గ శాసన సభ్యులు ఎమ్మెల్యే స్పందించి మంచినీరు అందించే ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నాము.అడా ప్రాజెక్టు నీరు అందించే విషయంలో శీతాకాలం, వేసవికాలం,వర్షాకాలం,వారానికి ఒకసారి లేక రెండు వారాలకు ఒకసారి నీరు వస్తున్నాయి.ఎన్నిసార్లు విన్నవించిన చెవిటి వాడు ముందు శంఖం ఊదిన చందంగా ఉందన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజలకు అందించే త్రాగునీరును రెండు రోజులకు ఒక్కసారైనా అందించే చర్యలు గైకొనాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ డిమాండ్ చేస్తున్నదన్నారు.లేనిచో వార్డు ప్రజలను తీసుకొని సంబంధిత కార్యాలయల ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని,ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధిత అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని (ఓపిడిఆర్) డిమాండ్ చేస్తున్నదన్నారు…