కలెక్టర్ జీఓను కలెక్టర్ అమలు పరచకుండా వీధులు ఉడ్చడం న్యాయమా?! తిరుమల తిరుపతి దేవస్థానంలో సులభ్ కార్మికులు గత కొన్నాళ్లుగా సమ్మెలో పాల్గొంటున్నారు. జీతం పెంచమని కోరుతున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడం మాని కలెక్టర్, ఇఓ, ఐపీఎస్, ఐఏఎస్ లు చీపుర్లు పట్టి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. విచిత్రం ఏమిటంటే గత ఏడాది మార్చి 29న ప్రొసీడింగ్స్ నెం. A/ 105/2022 పేరుతో జిల్లా కలెక్టర్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఆ ప్రకారం ఏ కార్మికుడు/కార్మికురాలినైనా ఒకరోజు పని చేయిస్తే రూ.679లు విధిగా వేతనం కింద చెల్లించాల్సి ఉందని ఇఓకు కూడా ఈ ఉత్తర్వుల కాపీని పంపారు. దీనికి భిన్నంగా కేవలం రూ.300లు కంటే తక్కువగా టిటిడిలో చెల్లిస్తున్నారు. కార్మికుల గోడును పట్టించుకోకుండా కలెక్టర్ గారు తానిచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా తానే వీధులు ఊడ్చడం ఎంతవరకూ సమంజసమని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు… కందారపు మురళి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి


