కేసీఆర్ అవినీతి.. పదేళ్లలో తెలంగాణ దివాలా తీసింది: అమిత్ షా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం 1200 మంది బలిదానంతో ఏర్పడితే.. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
మిగులు ఆదాయం ఉన్న ఈ రాష్ట్రం బీఆర్‌ఎస్ పాలనలో దివాలా తీసింది. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. లక్ష రుణమాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతికి యువత నోచుకోలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య గాలికి వదిలేశారు. ప్రతీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ నెరవేరలేదు. గ్రానైట్ కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగింది. సెప్టెంబర్ 17 నిర్వహణపై మాట ఇచ్చి తప్పారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణలో పేదలు, రైతులు, విద్యార్థులు నిరాశలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని బలంగా అనుకుంటున్నారు..
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం.. ఈ మూడు ఒక్కటే. ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారు.. ఎన్నికలయ్యాక కలిసిపోతారు. కాంగ్రెస్‌కు ఓటేసినా.. బీఆర్‌ఎస్, ఎంఐఎంలకు ఓటేసినట్లే. బీజేపీ పాలనలో అవినీతి ఉండదు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకం. మీ ఓటు భారత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తించాలి అని తెలంగాణ ఓటర్లను అమిత్ షా కోరారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



