
కాకినాడ గుడారిగుంట లో విడుదల టెంపుల్ నందు జిల్లా సంఘ కాపరులు, సెక్యులర్ వాదుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రేయర్ అండ్ అప్పీల్ జాతీయ అధ్యక్షులు, హైకోర్ట్ న్యాయవాది డాక్టర్ దొమ్మేటి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ, క్రైస్తవ, ముస్లిం, భాయి భాయి- నాడు నేడు రేపు ఇండియా లౌకిక దేశమే అంటూ నినాదాన్నిస్తూ సమావేశం ను ప్రారంభించారు. భారతదేశం అనేక సంవత్సరాలు గా సెక్యులర్ దేశంగా ఉందని అనేక మతాలు, జాతులు వారు అన్నదమ్ముల్లా కలసి మెలిసి జీవిస్తున్నారని, ఇప్పుడు ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ అనే పదాన్ని తొలగించడానికి అడుగులు వేస్తుందని,సెక్యులర్ వాదులతో పాటుగా క్రైస్తవ, ముస్లింలంతా కలసి దానికి వ్యతిరేఖంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రముఖ ముస్లిం నాయకులు పాల్గొన్నారు. జనవరి 29 న విజయనగరంలో కలెక్టర్ ఆఫీస్ కూడలి నందు మరియు ఫిబ్రవరి 10 న కాకినాడలో మెక్లరిన్ గ్రౌండ్ నందు నిరసన సభలు నిర్వహిస్తున్నామని దీనికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సంఘ కాపరులు నాయకులు, సెక్యులర్ వాదుల హాజరు కావాలని డాక్టర్ దొమ్మేటి సుధాకర్ కోరారు.

ఈ కార్యక్రమానికి దళిత ఐక్య సమాఖ్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ దొమ్మేటి రాజా సతీష్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై.ఎం.సి.ఎ. అధ్యక్షులు కొలమూరి ప్రభాకర్, వైసిపి రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మడికి సోనియా, రీజినల్ జేఏసీ అధ్యక్షులు ఐజాక్, జేఏసీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ రాజాజీ, విశ్రాంత ఉపాధ్యాయులు సుధాకర్, బి.రవి కుమార్, మడికి బాబ్జి, సాదే నరేంద్ర, లక్ష్మణ్, తదితరుల పాల్గొన్నారు.
You may also like
రైతుల పంటల సరపరలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం…
యశోద ఆసుపత్రిలో అరుదైన శాస్త్ర చికిత్స ప్రతి సెకను ఎంతో విలువైనది…
న్యూరో ఇండోస్కోపీ, రోబోటిక్స్, అధునాతన ఇన్వసివ్ బ్రెయిన్ వెన్న ముఖ సంరక్షణ…
అల్లిపూడి ఎస్సీ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే యనమల దివ్య గారి బాటలు… ధన్యవాదాలు తెలిపిన టిడిపి మహిళా కార్యకర్త కొండ్రు రవణమ్మ
ఆంధ్రప్రదేశ్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. న్యాయవాది కొండ్రు కళ్యాణ్.



