సీఎం జగన్ పాలనలో గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్

 

నాతవరం మండలంలో మంగళవారం వివిధ అభివృద్ధి పనులను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ప్రారంభించారు.

*గొలుగొండ పేట లో*
23.98 లక్షల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని, 17.50 లక్షలతో నిర్మించిన మినీ హెల్త్ క్లినిక్ భవనాన్ని సర్పంచ్ మిరపల రమణ, ఎంపీటీసీ తామరాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు.

*గుమ్మిడి గొండ లో*
గుమ్మిడి గొండ గ్రామంలో 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ వార్డు సచివాలయం భవనాన్ని ఎమ్మెల్యే గణేష్, సర్పంచ్ పంచాడ పాప, ఎం.పి.టి.సి. సుర్ల పాప, శెట్టి నూకరాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు.

*మన్యపురుట్ల గ్రామంలో*
మన్యపురుట్ల గ్రామంలో 25 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని సర్పంచ్ కొత్తుల తలుపులు, మాజీ సర్పంచ్ ముత్తం శివాజీ, ఎంపిటిసి జ్యోత్స్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రారంభించారు.

*ఎం.బి. పట్నంలో*
ఎంబి పట్నం గ్రామంలో 25 లక్షల వ్యయంతో నిర్మించిన వార్డు సచివాలయ భవనాన్ని అడిగర్ల నాయుడు బాబు, సర్పంచ్ కాళ్ల ఝాన్సీ రాణి, ఎంపీటీసీ పల్లి భవాని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు.

*మర్రిపాలెం లో*
మర్రిపాలెం గ్రామంలో 21.80 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ హెల్త్ సెంటర్ భవానాన్ని మరియు 23 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని సర్పంచ్ రమణమ్మ సాంబమూర్తి ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల గణేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం అని ఆయన అన్నారు. అంతేకాకుండా అన్ని సేవలు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచుతూ పరిపాలన వికేంద్రీకరించడానికి, గ్రామాలు స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా అభివృద్ది చెందడం కోసం తోడ్పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం భావన నుండి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, మండల వైసీపీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, పైల పోతురాజు, కరక అప్పలరాజు, సిరసపల్లి నర్సింగరావు, గొర్లి వరహాల బాబు, గవిరెడ్డి కృష్ణంరాజు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!