నాతవరం. ఫిబ్రవరి 1 (అఖండ భూమి)
అనకాపల్లి జిల్లా నాతవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా జె.రాంబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లో బాధ్యతలు నిర్వహించి బదిలీపై నాతవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా నియమితు లయ్యారు.ఇప్పటివరకు పనిచేసిన ఎంపిడిఒ ఎన్.హనుమంతరావు కాకినాడ జిల్లా గండేపల్లి కి బదిలీపై వెళ్లారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపిడిఒ ను పలువురు అధికారులు,నాయకులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎ ఒ పార్థసారథి, ఇ ఒ పి అర్ డి నరసింహమూర్తి, మండల విద్యాశాఖ అధికారి టి.అమృత కుమార్, ఎ పి ఒ చిన్నారావు, లగుడు నాగేశ్వరరావు, మైనం నాగ గోపి, మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు,ఎన్ ఆర్ ఇ జి యస్ సిబ్బంది తదితరులు పాల్గొని ఎంపిడిఓ కి శుభాకాంక్షలు తెలిపారు.



