గెలిచే ధైర్యం లేకనే విశ్వేశ్వరరాజు పై గిడ్డి ఈశ్వరి విష ప్రచారం: కొయ్యూరు వైకాపా నేతలు

 

 

గెలిచే ధైర్యం లేకనే విశ్వేశ్వరరాజు పై గిడ్డి ఈశ్వరి విష ప్రచారం: కొయ్యూరు వైకాపా నేతలు

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగుపడింది టీడీపీ నాయకులు

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాగుపడుతున్నది ప్రజలు

కొయ్యూరు అఖండ భూమిఫి బ్రవరి 1 అల్లూరి జిల్లా

యర్రవరం పవర్ ప్రాజెక్ట్ బినామీ విశ్వేశ్వరరాజు అంటూ విష ప్రచారం చేస్తున్న పాడేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యలను కొయ్యూరు మండల వైసిపి పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఖండించారు. వైకాపా పార్టీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు‌ పై గెలిచే సత్తా,ధైర్యం లేకనే టిడిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అతనిపై విష ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ పార్టీకి ఓట్లు వేస్తే ఆదివాసీల జీవితాలు బుగ్గిపాలు అవుతాయో మా కన్నా మీకే బాగా తెలుసు అని చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ జైతి రాజులమ్మ,జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు ధోని బాబ్జి,అంతాడ సర్పంచ్ సుర్ల చంద్రరావు అన్నారు. టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో బాగుపడింది టిడిపి పార్టీ నాయకులే అని, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగుపడుతున్నది ప్రజలు అని అన్నారు. వైసిపి పార్టీ పేరు చెప్పుకొని ఎమ్మెల్యేగా గెలిచి, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను పక్కనపెట్టి,కేవలం మీ సొంత స్వలాభం కోసం టిడిపి పార్టీకి అమ్ముడుపోయిన నువ్వు వైసిపి పార్టీపై, పార్టీ నాయకులపై విష ప్రచారం చేస్తున్నావంటే మీ రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందని అన్నారు. విశ్వేశ్వరరాజు పై ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే అతనిపై ఈ విధమైన తప్పుడు విష ప్రచారం చేస్తున్నావంటూ వైసిపి పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రజల గమనిస్తూనే ఉన్నారని, రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!