కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి – లెక్కల భాస్కర్
కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ వైసిపి పాలనలో పచ్చని సస్యశ్యామలంగా ఉండే కోస్తా జిల్లాలలో దాడులు, అరాచకాలు, హత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. నియోజవర్గంలోని దళితులపై, బడుగు బలహీన వర్గాలపై అన్యాయంగా అనేక దాడులు జరగడం బాధాకరమని ఆయన అన్నారు. అన్యాయానికి గురైన బాధితునికి న్యాయం జరగటం లేదని భాస్కర్ వాపోయారు. గాయపడిన బాధితులపై అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులను కుట్రపూరితంగా బనాయించడం దారుణమని ఆయన అన్నారు. నియోజకవర్గంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను,
ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఈ పాలనను అంతమొందించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన పాలన కొరకై తెలుగుదేశం పార్టీ ని గెలిపించాలని నియోజకవర్గంలో యనమల దివ్య ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



