‘ఉపాధి’ పనులు ప్రారంభించిన ఎంపీపీ దేవదాస్ రెడ్డి
ఇచ్చాపురం, అఖండ భూమి :
స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు పైల దేవదాస్ రెడ్డి జలంధ్ర కోట పంచాయతీ నారాయణ సాగర్ లో గ్రామీణ ఉపాధి హామీ పనులను శుక్రవారం ప్రారంభించారు. జలంధర్ కోట, చోట్రాయిపురం గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఉపాధి హామీ కూలీలు ఈ కూలి పనుల్లో పాల్గొంటున్నారు. పురుషోత్తపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
2.5 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో పురుషోత్తపురం గ్రామ సచివాలయం పరిధిలో గెద్దలపాడు గ్రామంలో సిమెంట్ మెట్ల నిర్మాణం పనులు పూర్తి కావడంతో, ఆమెట్ లను ఎంపీపీ పైల దేవదాసు రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో సర్పంచ్ పైన తులసి మోహన్ రెడ్డి, ఏ ఏ బి చైర్మన్ లడ్డు కేశవ్ పాత్రో, మాజీ పిఎసిఎస్ చైర్మన్ దుర్గాసి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



