ఏపీలో భయానక వాతావరణం
ఇచ్చాపురం, అఖండ భూమి:
రాష్ట్రంలో భయానక వాతావరణ సృష్టించి వైసిపి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నదని స్థానిక టిడిపి యువ నేతలు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు.రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతున్నదని, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలు గిట్టని వారిపై దాడి చేస్తుంటే , ఉన్నతాధికారులు వంతపడుతూ ఉంటే, ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుందని ప్రశ్నించారు. ప్రజల స్వేచ్చని, మీడియా స్వేచ్ఛని హరించడానికి తీసుకున్న చర్యలు ఫలించిన దాఖలాలు గతంలో కూడా ఎప్పుడు లేవని, ఆ విషయాన్ని గుర్తురెగాలని హితవు పలికారు.ఈ మీడియా సమావేశంలో ఇచ్చాపురం నియోజకవర్గ టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్ యాదవ్, టిడిపి 17వ వార్డు ఇన్చార్జి జన్నెల సంతోష్ యాదవ్, ఐ టి డి పి పట్టణ అధ్యక్షుడు సాలిన జగదీష్, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నియోజకవర్గం క్రియాశీలక సభ్యుడు ఫైల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


