మా గ్రామానికి కరెంటు కలెక్షన్ కలపండి – కరకవలస గిరిజనలు రోడ్డుపై బైఠాయించి గిరిజనులు ధర్నా.

 

 

 

మా గ్రామానికి కరెంటు కలెక్షన్ కలపండి – కరకవలస గిరిజనలు

రోడ్డుపై బైఠాయించి గిరిజనులు ధర్నా.

అల్లూరి జిల్లా :అనంతగిరి (అఖండ భూమి )ఫిబ్రవరి 23: అనంతగిరి మండలం మారుమూల రొంపెల్లి పంచాయతీ కరకవలస గ్రామం 29 కుటుంబాలు కొండదొర ఆదివాసి గిరిజనులు 150 మంది జనాభా జీవనం సాగిస్తున్నారు.2021-22 సంవత్సరంలో గొర్ల నుండి కరకవలస గ్రామానికి 4 కిలోమీటర్ దూరం 100 కరెంటు స్తంభాలు. గొయ్యిలు తీసి. కాంక్రీట్ నింపి. స్తంభాలు ఏర్పాటు చేసి. వైర్లు లాగే ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేసి. మా గ్రామస్తులమే 40 మంది నెల రోజులు పాటు కష్టపడి కరెంట్ లైన్ ఏర్పాటు చేసుకున్నాము. వాస్తవానికి రొంపెల్లి గ్రామం నుండి మా గ్రామానికి ఒక కరెంట్ పోలే ఏర్పాటు చేయాలి.ఇంత పని చేసినా గొర్ల గ్రామానికి చెందిన ఒక రైతు ఒక కరెంటు స్తంభాన్ని తీసేయడం జరిగింది.

దీనితో మా గ్రామస్తులందరూ కలిపి. రొంపెల్లి గ్రామం నుండి కరకవలస గ్రామానికి విజిట్ లైన్ ఏర్పాటు చేసుకున్నాము. రొంపిల్లి లైన్ కలిపితే ఆ గ్రామానికి విద్యుత్తు సౌకర్యం కలుగుతుంది. అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన. విద్యుత్ అధికారులు స్వయంగా పరిశీలన చేయకుండా. అనేక సాకులు చెబుతున్నారు.వాస్తవానికి మా గ్రామానికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక బోర్ ని ఏర్పాటు చేశారు. కరెంట్ లేకపోవడంతో బోరుకు మోటర్ బిగించలేదు. దీంతో మా గ్రామస్తులు అందరిని గొర్లగడ్డ రిజర్వాయర్కు చలమలు తీసుకొని నీళ్లు తీసుకుంటున్నాము.

దీంతో మా పిల్లలు ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో. తరచూ అనారోగ్యం గురవుతున్నాము.

గత 2020లో మా గ్రామంలో ఐదుగురు కాలుయాపులు. కిడ్నీ సమస్యలతో మరణించారు. కానీ మా గ్రామానికి ఎటువంటి అధికారులు సందర్శించలేదు ఇప్పటికైనా మాకు విద్యుత్తు లైన్ ని రొంపిల్లి నుండి కలిపి లైట్లు వెలిగేస్తారని కోరుతున్నాము ఈ కార్యక్రమానికి జాగాడ సన్యాసి. జాగడ పెద్ద సన్యాసి. జాగడ జోగులు పాల్గొన్నారు.

ఐటీడిఎ ప్రాజెక్టు అధికారి అభిషేక్ కు,డి ఈ ఈ కు

లెటర్ ఇవ్వటం జరిగింది

తక్షణమే కరకవలస గ్రామానికి రొంపెల్లి నుండి విద్యుత్ లైన్ కలిపి విద్యుత్ వెలిగించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే పరిష్కరిస్తామని ఆమె ఇచ్చారు

Akhand Bhoomi News

error: Content is protected !!