
సత్రాల మేనేజ్మెంట్ వారితో ఈవో సమావేశం…!
శ్రీశైలం ఫిబ్రవరి 23( అఖండ భూమి ): మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీశైల దేవస్థానం పరిధిలోని అన్ని నిత్య అన్నదాన సత్రాల నిర్వాహకు ల తో ఈవో పెద్దిరాజు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి దేవస్థానం రెవిన్యూ సిబ్బంది, అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి నిర్వహించినారు.ఈ సమావేశంలో శ్రీశైల దేవస్థానం కార నిర్వహణ అధికారి డి పెద్దిరాజు మాట్లాడుతూ
సేవా దృక్పథంతో భక్తులకు సేవలందించాలని, శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు రద్దీ అధికంగా ఉంటుంది కనుక మీ ముందస్తుగా మీరు మీ సత్రాలలో మౌనిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని, భక్తులకి ఇబ్బంది కలుగకుండా చూడాలని ముందు జాగ్రత్త తీసుకోవాలని తెలపడం జరిగింది. దేవస్థానం వారు వసతి సౌకర్యాలు, అదేవిధంగా సౌకర్యాలు, మెరుగుపరుచుకోవాలని. ఎటువంటి సమస్యలు లేకుండా సత్రoలో సమస్యలు లేకుండా చూసుకోవాలని , దేవస్థానం శివరాత్రి సమయాల్లో భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా, భోజన సౌకర్యాలు, ఇతర సమస్యలు, నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, స్థానిక తాసిల్దార్ గుర్రప్ప డిప్యూటీ తాసిల్దార్ కిషోర్ కుమార్, ఎస్సై, సత్రం మేనేజ్మెంట్ వారు, ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


