కల్తీ కల్లు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి సిపిఐ
స్థానిక వెల్దుర్తి పట్టణంలో సిపిఐ కార్యాలయంలో సీపీఐ వెల్దుర్తి మండలం కార్యదర్శి టి.కృష్ణ. మండల సహాయ కార్యదర్శి డి.రాజు. రైతు సంఘం అధ్యక్షుడు మాధవ్ కృష్ణ మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని కల్తీ కల్లు తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్తీ కల్లు తాగి మహిళను ఇబ్బంది పెడుతూ ఇంటికాడ కుటుంబాన్ని పోషించలేక ఇబ్బంది పడుతూ మహిళలు కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పనికి వెళ్లి డబ్బులు సంపాదిస్తే సంపాదించిన అంత డబ్బు కల్తీ కల్లు దుకాణాలకు ఖర్చు చేస్తున్నారని మహిళల ఆవేదన వ్యక్తం చేశారు మండలంలో కల్తీకల్లు తాగి చాలామంది ప్రజలు కూడా మరణించడం జరిగింది కాబట్టి మండలంలో కల్తీ కల్లు దుకాణాలకు పర్మిషన్ ఉందా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే కల్తీ కల్లు దుకాణాలపై పరిశీలన చేసి ఆ దుకాణాలపై యాజమాన్యాలపై కేసు నమోదు చేయాలని వారు అన్నారు పట్టణంలో ఉన్నటువంటి కల్తీ కల్లు తయారు చేస్తున్నటువంటి వాళ్ల పై కేసు నమోదు చేసి కల్తీ దుకాణాలను మూసివేయాలని వారన్నారు లేనిపక్షంలో ప్రజలందరినీ కలుపుకొని సిపిఐ పార్టీగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళ నాయకులు లక్ష్మీదేవి. నాగ తిమ్మయ్య. తదితరులు పాల్గొన్నారు
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..