ఎమ్మెల్యే గణేష్ కు రోజు రోజు కు పెరుగుతున్న ప్రజాధరణ..

 

నర్సీపట్నం మార్చి16 (అఖండ భూమి న్యూస్)

తాజాగా ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికలకు సంబంధించి తేదీలను ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలకు కూడా ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి పెట్ల ఉమా శంకర్ గణేష్ వైసిపి నుంచి రంగంలోకి దిగుతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ కు ప్రజా ధరణ రోజురోజుకు భారీ గా పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రభుత్వం తలపెట్టిన ప్రజావాణి, జగనన్న సురక్ష, గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గణేష్ స్వయంగా పాల్గొంటూ ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు పంపిణీ మరియు ప్రజల ఇతర సమస్యలను వ్యక్తిగతంగా సంప్రదించి తెలుసుకుని వాటి పరిష్కారం కొరకు పనిచేసిన ఏకైక ఎమ్మెల్యేగా ప్రజల మద్దతు కూడగట్టుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం సమగ్రమైన కృషి చేశారని అదే ఆయన విజయానికి దోహదపడుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే సామాన్యునికి నిరంతరం అందుబాటులో ఉంటూ ఆప్యాయత గా పలకరిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించారని నైతిక విలువల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ అడుగులు వేస్తూ ఎవరిని నొప్పించకుండా పాలన సాగించారని సామాన్య ప్రజల మెప్పును సైతం పొందారని అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలను సమ దృష్టి తో ప్రాధాన్యత నిస్తూ చిరునవ్వుతో ముందుకు సాగేవారిని అదే ఆయనను మరలా నియోజక వర్గంలో గెలిపిస్తుందని నియోజకవర్గ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో మరోసారి పెట్ల గణేష్ గెలుపు తధ్యమని ఆ పార్టీ నేతలు తెలిపారు.

Akhand Bhoomi News