కోటనందూరు మార్చి 22 (అఖండ భూమి)
తుని అసెంబ్లీ నియోజక వర్గం, కోటనందూరు మండలం లో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా, మండలంలోని కీలక నేతగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసిన లెక్కల భాస్కర్ టిడిపికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పట్ల మండలంలోని పలువురు నేతలు, కార్యకర్తలు ప్రజలు ఖంగు తిన్నారు. యువతకు, ప్రజలకు, కార్యకర్తలకు మనో ధైర్యాన్నిస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ తెలుగు దేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేశారని పలువురు నేతలు తెలిపారు.
2019 లో అధికార పార్టీ చర్యలకు భయపడి పార్టీని పట్టించుకోలేని పరిస్థితుల్లో టీడీపి మండలంలో అయోమయ పరిస్థితి లో ఉండగా అప్పటి జడ్పిటిసి ఎలక్షన్లలో పార్టీ కోసం తమ అభ్యర్థిని బరిలో ఉంచి మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలూ కృషి చేశారని వ్యాఖ్యానించారు. లెక్కల భాస్కర్ మండలంలో కార్యకర్తలకు అండ గా ఉంటూ యోగ క్షేమాలు తెలుసుకుంటూ మంచి వ్యక్తిగా, నాయకుడుగా పేరొందారని తెలిపారు. అప్పటిలో అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రలోభాలకు బెదిరింపులకు లోబడకుండా మొక్కవోని దీక్షతో టిడిపిని ముందుకు నడిపించిన వ్యక్తిగా లెక్కలు భాస్కర్ సేవలు వర్ణనాతీతమని కష్టాలలో ఉన్న అనేకమంది బాధితులకు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ ఆర్థిక సహాయం చేస్తూ వారిని ఆదుకుంటూ వారి మన్ననలను పొందే నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాజీ నామా వల్ల కోటనందూరు మండలంలో టీడీపి కి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పలువురు అభిప్రాయ పడ్డారు.అంతే కాకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంతోమందికి భరోసాలు ఇస్తూ పార్టీ బలోపేత దిశగా ముందుకు సాగేవారని అయితే పార్టీలో రోజురోజుకు జరుగుతున్న మార్పులు పరిణామాల వల్ల ఆయన సేవలకు తగిన గుర్తింపు రాక పోవటం వల్ల కార్యకర్తలకు ఇచ్చిన బరోసా వ్యర్థమని భావించి తీవ్ర మనస్తాపానికి గురైనారని పలువురు మహిళలు తెలిపారు.మరియు అధిష్టానం నిజమైన నిబద్ధత కలిగిన నాయకులను నమ్మకుండా పులి చర్మం కప్పుకున్న తోడేల్లను నమ్మడం పట్ల ఆయన అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసారని పార్టీ లో ఇదే పంథా కొనసాగితే రాజీనామాల పర్వం కొనసాగుతుందని పలువురు నేతలు స్పష్టం చేశారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్