కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో రత్నపల్లి, యాదరాల గ్రామాలలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అమ్మకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి జగన్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రజలకు తెలిపారు. ప్రతి ఇంటికి పూలమాలలు వేసి ఆహ్వానించి అభినందించడం జరిగింది. రానున్నది జగన్ ప్రభుత్వమేనని ప్రజలకు తెలిపారు. టిడిపి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ప్రజలకు వెనువెంట ఉండి సేవలు అందించే భాగ్యం కల్పించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరల మాకే సీటు కేటాయించడం జరిగింది జగన్ ప్రభుత్వంలో మరల ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని ఓటర్లని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రత్న పల్లె రమణారెడ్డి, కొత్తూరు వెంకటేశ్వర్ రెడ్డి, అల్లు గుండు శ్రీరామ్ రెడ్డి, బొమ్మిరెడ్డి పల్లె మధుసూదన్ రెడ్డి, నర్సాపురం వెంకట కృష్ణారెడ్డి, బింగ్ దొడ్డి జగన్మోహన్ రెడ్డి, వెల్దుర్తి పట్టణ కార్యదర్శి వెంకటనాయుడు, ఆరిఫ్, చెర్ల కొత్తూరు శేఖర్, గోవర్ధనగిరి కేశవులు, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


