బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జోలికి వస్తే తాటతీస్తాం

 

 

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జోలికి వస్తే తాటతీస్తాం

బెల్లంపల్లి మే22(అఖండ భూమి):బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

తేదీ 22 5 2024 బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు మాట్లాడుతూ..ఈనెల 15వ తేదీన నమస్తే తెలంగాణ పత్రికలో లోకల్లో ఉండరు హైదరాబాదులో దొరకడు అనే ఆర్టికల్ రావడం జరిగింది. దీనిని కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం ఎమ్మెల్యే శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని గడ్డం వినోద్ బెల్లంపల్లి అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు అలాగే వివిధ శాఖల మంత్రులను కలుస్తూ బెల్లంపల్లి అభివృద్ధికి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది పని కట్టుకొని ఎమ్మెల్యే వినోద్ ను విమర్శించే విధంగా మాట్లాడడం,పత్రికల్లో రాయించడం,సరైనది కాదు ఎమ్మెల్యే పైన దురుసుగా మాట్లాడిన అసభ్యకరంగా రాసిన ఇక మేము ఊకోపోమని తెలిపారు. మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతర స్వామి మాట్లాడుతూ..గడ్డం వినోద్ ఓటు వేయలేదని అనడం సరైనది కాదు ఎందుకంటే పెద్ద పెళ్లి పార్లమెంటు ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓటింగ్ వచ్చిందని దానికి పూర్తి కారణం గడ్డం వినోద్ ది కష్టం కృషి ఉందని గడ్డం వినోద్ పైన నమస్తే తెలంగాణ పత్రికలో విమర్శించే విధంగా రాయడం సమంజసం కాదని వారు తెలిపారు.ఈయొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమరి సూరిబాబు,నాతరి స్వామి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గేల్లి జయరాం,మత్తమారి సత్తిబాబు,బాకం మల్లేష్, ధరణి సత్యనారాయణ, కౌన్సిలర్ గుజ్జ రవి,ఠాకూర్ కన్నయ్య సింగ్,అమానుల్లా ఖాన్,మత్తమారి జగన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసర్ల యాదగిరి, అల్లం కిషన్,గజ్జల కృష్ణమోహన్,బండి రాజేష్, జుమ్మిడి బాలయ్య,ఆడెపు మహేష్,పసుపులేటి రాజేష్ నాయుడు గజ్జల మల్లేష్,ఆకు రెడ్డి,శంకర్,గంధం రమేష్, సాగాల రాజం,రాజరత్నం, పాముల రాజలింగు,గౌస్ బాయ్,పంచల శ్రీనివాస్, సోషల్ మీడియా బాలు యాదవ్,సమ్మిరెడ్డి,మాదరి పెద్ద సామి,టీఎస్ చారి,దాసరి బాణయ్య,మత్తమారి రాయమల్లు,మైనార్టీ నాయకులు వాజిద్,ముజీద్, సాదిక్,పోతురాజుల శ్రీనివాస్, దుర్గం దేవాజి,చంద్రమొగిలి, గౌడ్,కన్నీరు రాయలింగు,జాన్ సుందర్ వే,ల్పుల రాములు, మాదరి సామి,ఉద్ది సమ్మయ్య, గిరి అంజయ్య, తాటిశెట్టి శ్రీనివాస్,గట్టు గంగారం,సల్లూరి రాజేష్,బర్రె మదినయ్య,రామగిరి మహేష్, తాళ్ల రవికుమార్,ఆర్ ఎం సింగడే,తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News