వ్యక్తి నిర్మాణమే జాతీయ పునర్విర్మానానికి దోహదపడుతుంద

వ్యక్తి నిర్మాణమే జాతీయ పునర్విర్మానానికి దోహదపడుతుంద

 

కామారెడ్డి ప్రతినిధి: ఏప్రిల్ 21 (అఖండ భూమి):

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర్ శాఖ ఆధ్వర్యంలో నేడు పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ ముగింపు కార్యక్రమం శిశు మందిర్ స్కూల్ లో నిర్వహించరు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా ఏబీవీపీ కామారెడ్డి జిల్లా ప్రముఖ బి.ఎన్. గిరి, ముఖ్య అతిథిగా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం, ఆర్యభట్ట గ్రూప్స్ ఆఫ్ కాలేజ్ ఇంచార్జ్ గురువేందర్ రెడ్డి లు పాల్గొనీ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య వక్త బిఎన్ గిరి, విద్యార్థులతో మాట్లాడుతూ వ్యక్తి నిర్మాణమే జాతీయ పునర్విర్మానానికి దోహదపడుతుందని అలాగే ఏబీవీపీ జ్ఞానం శీలం ఏ కథ అనే అంశాల ఆధారంగా పనిచేస్తుందని, నేటి విద్యార్థులు స్వామి వివేకనందను ,భగత్ సింగ్ రాజ్ గురు సుగుదేవ్ లాంటి వీరులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఏబీవీపీ విద్యార్థుల శ్రేయస్సుకోసం ఇట్లాంటి ఉచిత పాలిటెక్నిక్ లాంటి మరెన్నో సేవా పూరిత కార్యక్రమాలను దేశం స్వాతంత్రం పొందిన నాటి నుంచే చేస్తుందని అలాగే ఇది ఇలాగే రాను రాను కూడా చేయనుందని పేర్కొన్నారు. దానిలో భాగంగానే వచ్చే సంవత్సరం ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ తో పాటు ఉచిత ఎంసెట్ కోచింగ్ ఏర్పాటు చేసే యోచన చేస్తామని తెలియజేశారు. అలాగే ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి షేక్ సలాం మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్ కోసం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏబీవీపీ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏబీవీపీ కల్పిస్తున్నటువంటి ఇట్లాంటి వేదికలను విద్యార్థులు సద్వినియం చేసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలన్నారు. గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పలు ఉత్తమ మాటలను బోధించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ చరన్, జిల్లా హాస్టల్ కన్వీనర్ కలీం, కార్యకర్తలు రోహిత్, అల్తాఫ్, వెంకి, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News