ఎస్సీ ఎస్టీల సబ్సిడీ మాటేంటి? అంకంరెడ్డి బుల్లిబాబు

 

కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ హయాంలో ఎస్సీ ఎస్టీల కోసం విద్యుత్ రాయితీ హామీ ని తూచా తప్పకుండా కొన సాగించారని ప్రస్తుత వైసిపి ప్రభుత్వం విద్యుత్ రాయితీ 200 యూనిట్ల హామీకి కోతలు విధిస్తూ ఎస్సీ వినియోగ దారులను ఇబ్బందులకు గురి చేసారని ఆయన అన్నారు. అంతే కాకుండా ఎస్సీ వినియోగ దారులకు కుల ధ్రువీకరణ పత్రాలు సరిగా లేవని సాకులు చెబుతూ సబ్సిడీ కి కోతలు విధిస్తున్నారని ఆయన అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఎస్సీ లచే ఓట్లు వేయించుకోవడం పూర్తయిన వెంటనే వారి విద్యుత్ కనెక్షన్లు తొలగించడం వారిని మోసం చేయడమే నని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమైనట్టు? అంటూ ఆయన ప్రశ్నించారు. ఎస్సీ వినియోగదారులకు సబ్సిడీ 200 యూనిట్ల రాయితీ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం 200 యూనిట్లు దాటని ఎస్సీ వినియోగ దారులను కరెంట్ బిల్లులు కట్టమని వత్తిడి చేయటం, కనెక్షన్లు తొలగిస్తామని బెదిరించడం సరికాదని ఆయన అన్నారు. గత 15 సంవత్సరాలుగా అడగని విద్యుత్ బిల్లులు ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు.దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి సబ్సిడీని అందించాలని ఆయన కోరారు.

Akhand Bhoomi News