ఉమ్మడి కూటమిదే హవా… కూటమికి ఊహించని ఫలితాలు .. 

ఉమ్మడి కూటమిదే హవా… కూటమికి ఊహించని ఫలితాలు ..

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకతలు.

ల్యాండ్ సీడింగ్ యాక్ట్ వైసీపీని కొంప ముంచింది..

ఉమ్మడి కూటమిలో ప్రధానమంత్రి ఉండడంతో ప్రజలలో విశ్వాసం పెరిగింది.

రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు రాక తప్పదని ప్రజల తీర్పు ఇవ్వబోతున్నారు..

టిడిపి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మహిళల ఓటు శాతం పెరిగింది.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మొండి చేయి చూపించిన రాష్ట్ర ప్రజలు…

ఇంకా బ్రమలోనే వైసీపీ క్యాడర్..

2024 సార్వత్రిక ఎన్నికల 6 నెలల ముందే అఖండ భూమి డైలీ న్యూస్ పేపర్ సర్వేలో బయటపడిన నిజాలు..

అఖండ భూమి డెస్క్ : 2024 సార్వత్రిక ఎన్నికలు ఆరు నెలలు ముందే అఖండ భూమి డైలీ న్యూస్ పేపర్ ఎన్నికల ఫలితాలపై సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టిడిపి శ్రేణులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై యుద్ధభేరి మొదలుపెట్టారు. అయితే టిడిపి స్పందించిన తీరును పట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంచనాలు అప్పటికే అర్థమయ్యాయి. దీంతో టిడిపి ప్రభుత్వం పై బురద జల్లి వారిని ఎలాగైనా రానివ్వకుండా చేయడం కోసం క్రిమినల్ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఈ యుద్ధభేరిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు పెట్టడంతో రాష్ట్ర ప్రజలు క్రిమినల్ మైండ్ గేమ్ ఆడే వ్యక్తికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుందా.. ! అన్న ఏపీ ప్రజలు ఇలాంటి వ్యక్తికి చమర గీతం పాడాలని ముఖ్య ఉద్దేశంతో… నిమురు కప్పిన నీరుల… బూడిదలో నిప్పులాగా ఉండి ప్రజా తీర్పు ఇచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంతవరకు చంద్రబాబు నాయుడు పై పెట్టిన కేసుకు ఎటువంటి రుజువులు రాష్ట్ర ప్రజలకు చూపించకపోవడంతో ప్రజలు తిరుగుబాటుకు నడుం బిగించారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ అధినేత టిడిపి శ్రేణులకు అండగా నిలిచాడు. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ (కాంగ్రెస్ హటావో దేశ్ బచావో) అన్న నినాదాలు దేశం పవన్ కళ్యాణ్ వైపు తొంగి చూసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నందు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అరాచక అవినీతి రాక్షస పాలనకు చమర గీతం పాడెందుకు నడుము బిగించారు. ఇందులో భాగంగా ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజలకు వివరిస్తూ తమదైన శైలిలో వాగ్దానాలు ప్రజలకు విన్నపాలు, ప్రభుత్వ పాలకులకు హెచ్చరికలు, ప్రజలు తిరుగుబాటు చేసేందుకు రోజులు దగ్గరపడ్డాయి జగన్ అని బాయ్ బాయ్ జగన్ అని జగన్ మోహన్ రెడ్డికి, నిద్ర లేకుండా చేశాడు పవన్ కళ్యాణ్. వైసిపి ప్రభుత్వం ప్రతిపక్ష నేతల మాటలను పెడచెవిన పెట్టడంతో అంధకారంలోకి వైసిపి ప్రభుత్వం వెళ్ళింది. నారా చంద్రబాబు నాయుడు పై కేసులు బనాయించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జైలుకు పంపించినప్పుడు, రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయోమయంలో ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఒక ఆపద్బాంధవుడు లాగా రాష్ట్ర భవిష్యత్తు ప్రజలకు గుర్తు చేస్తూ… మిత్రపక్షాన్ని వెనుకేసుకొచ్చిన ఘనత జనసేన పార్టీ అధినేతకే చెల్లింది. ఇందులో భాగంగా ఉమ్మడి కూటమిగా ఏర్పడి రాష్ట్రం అంధకారంలోకి వెళుతుంది. అక్రమార్కుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అడుగడుగున సమాచారాలు చేరవేస్తూ ఉమ్మడి కుటుంబం గా ఏర్పడి ప్రజలకు నమ్మకం కలిగించేందుకు టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో ప్రజలకు విశ్వాసం పెరిగింది. దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమికే ఎక్కువ సంస్థలు సర్వేలో కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఒకటి రెండు సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఉమ్మడి కూటమిదే విజయం తద్యమని సర్వేలు వెల్లడించాయి.. ఇందులో భాగంగా అఖండ భూమి డైలీ న్యూస్ పేపర్ యాజమాన్యం సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు కూడా ఉమ్మడి కూటమికే ఎక్కువ ప్రజల మద్దతు ఉన్నట్లు తేల్చి చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టిన ప్రజల సంక్షేమం కోసం గుర్తుండిపోయే పథకాలు ఏవి కూడా పెట్టలేదని ప్రజలు గమనించి రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు ముఖ్యమని గమనించక తప్పలేదని ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలు ఉమ్మడి కూటమి టిడిపి పార్టీకి 134, జనసేన పార్టీకి 21 స్థానాలకు 21 స్థానాలు మెజార్టీతో గెలుపొందుతాయని, అదేవిధంగా బిజెపి 10 సీట్లలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కైవసం చేసుకోబోతుందని తేలింది. ఇవి కేవలం అంచనాలు మాత్రమే నాలుగో తారీఖు తర్వాత ప్రభుత్వం సర్వేల ప్రకారం గా నడిచిందా ప్రజాభిప్రాయాన్ని ఏ సంస్థ కూడా పసిగట్టలేకపోయిందా అన్న నిజాలు బయటపడనున్నాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!