అయ్యా కలెక్టర్ సారూ… అయ్యా ఎమ్మెల్యే సారూ…

 

అయ్యా కలెక్టర్ సారూ… అయ్యా ఎమ్మెల్యే సారూ…

ఇకనైనా మా మొర ఆలకించిరా? మా పాట్లు కనపడటం లేదా? సామాన్య ప్రజలంటే ఇంతటి చులకన భావమా?

భామిని మండలంలో మొద్దు నిద్రలో ఆర్&బీ అధికారులు పట్టించుకోని రాజకీయ నాయకులు అత్యవసర వైద్యం నిమిత్తం సకాలంలో వెళ్లలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

సకాలంలో బస్సులు, ఆటోలు రాక ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు

భామిని మండలం : అఖండ భూమి వెబ్ న్యూస్

పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ నియోజకవర్గంలో భామిని మండలంలో బిళ్ళమాడ సమీపంలో ఆర్ అండ్ బి రోడ్డు గుంతలమయం అవ్వటంతో ఒడిస్సా, ఛత్తిష్ ఘడ్ నుంచి వచ్చే భారీ వాహనాలు అందులో కూరుకుపోయి నిలిచిపోవటం తో నిత్యం రద్దీ గా ఉండే రహదారి ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర వైద్యం కోసం ప్రయాణించే రోగులు, సామాన్య ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. వీరి బాధను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే నిమ్మకు నీరెక్కినట్లు వారి ప్రవర్తన ఉండటంతో భామిని మండల ప్రజలకు ప్రాణసంకటంగా తయారయ్యింది. పోనీ నిన్నటి వరకు ఎన్నో మాటలు చెప్పిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పట్టించుకున్న పాపాన లేదు.

సామాన్య ప్రజలు పట్ల మరీ ఇంత చులకన భావం చూపించటం అధికారులకి మరియు రాజకీయ నాయకులకు తగదని, ఇకనైనా మా ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు, రాజకీయ నాయకులకు ప్రజలు విన్నవించుకుంటున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!