నేడు ఎడ్లపొలాల అమావా స్య,జంతువులను ప్రేమించే తత్వం తెలుపితుంది

 

నేడు ఎడ్లపొలాల అమావా స్య,జంతువులను ప్రేమించే తత్వం తెలుపితుంది

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య

కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 1,(అఖండ భూమి).

హిందూమత విశ్వాసాల ప్రకారం పొలాల అమావాస్య కు ప్రత్యేకత ఉంది పూర్వీకుల ను స్మరించుకుంటూ వివాహిత మహిళలు తమ సంతానం కోసం పిల్లల యోగక్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను ఆచరిస్తా రు. శ్రావణ అమావాస్య స్థితి సెప్టెంబర్ 2 తెల్లవారుజామున 52 నిమిషాల ప్రారంభమై మంగళవారం ఉదయం ఏడు గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ అమావాస్య సోమవారం రోజున వచ్చింది కాబట్టి ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని కూడా అంటారు. పూర్వకాలం లో బ్రాహ్మణ మహిళలకు ప్రతి ఏటా పిల్లలు పడుతుంటారు. అయితే ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు .కొన్ని గంటల్లో మరణిస్తున్న బిడ్డల ను చూసి ఎంతో దుఃఖంతో ఆమె ఊరి వెలుపల ఉన్న పోచమ్మ చుట్టు చనిపోయిన పిల్లల్నిసమాధిచేస్తుంది.అయితే ప్రతి ఏటా పొలాల అమావా స్య పిల్లలు పుడుతున్నారు కానీ పొలాల అమావాస్య సమయానికి మరణిస్తున్నారు. దీంతో తాను నోము నోచుకోవ డానికి ఎవరిని పేరంటానికి పిలిచినా విముఖత చూపు తున్నారు. ఆ సమయంలో తాను పూర్వజన్మలో ఏమో తప్పు చేశానని బాధపడింది. అప్పుడు పోచమ్మ తల్లి బ్రాహ్మ ణమ్మతో గత జన్మలో పొలాల అమావాస్య పేరంటాలు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం, గారె లు పెట్టావు. పులుపు, తీపి సరిపోయిందో లేదో అని చూశావు. ఆచారాలన్నీ పాటించకుండా అమంగళం చేశావు. అందుకే నీ బిడ్డలు మరణిస్తున్నారని చెప్పింది. తన తప్పని తెలుసుకున్న ఆమె పోచమ్మ తల్లి కాళ్ళ వెళ్ళబడింది .అప్పుడు పోచ మ్మ తల్లి కనుకరించి శ్రావణ మాసం చివరి రోజున భద్రపద మాసంలో మొదటగా వచ్చే రోజు ను పొలాల అమావాస్య అంటారు. ఆ పర్వదినాన గోమాత పేడతో అలికి పసుపు కుంకుమతో రాసి కందము మొక్కను అమ్మగా భావించి తొమ్మిది వరసల దారంతో పసుపు కొమ్ము కట్టి ఆ తోరా నన్ని కందపుమొక్కకు కట్టి పూజ చేయాలి. తొమ్మిది వరసల తోరం పేరంటాలకు ఇచ్చి మనం కట్టుకోవాలి. పిండివంటలను అమ్మవారికి నివేదన చేయాలి .భోజనం చేసిన తర్వాత తాంబూలం మీ సామర్థ్యం మేరకు దానధ ర్మాలు చేయాలి ఇలా చేయ డం వల్ల పిల్లలు మరణించ కుండా కలరా, మలేరియా, మసూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అని వివరించింది .ఆ తర్వాత వ్రతాన్ని చేసిన బ్రాహ్మణమ్మ తిరిగి తన బిడ్డల్ని పొందినట్లు పురాణ కథలు చెబుతున్నా యి ప్రకృతి పరంగా కూడా ఈ పండుగ ఎంతో విశిష్టమైనది వ్యవసాయంలో రైతులు తన సహాయకారిగా ఉండే ఎడ్లను అలంకరించి వాటికి శనిగలు పోలేలు తినిపిస్తారు ఈ విధం గా రైతులు కూడా తమలో భాగమైన పశుపక్షాదులను ప్రేమించే తత్వాన్ని ఎడ్ల పొలా ల అమావాస్య మనకు తెలి యజేస్తుంది ఎడ్ల పొలాల అ మావాస్య రోజు చాలా గ్రామా ల్లో ఊరు దేవతల చుట్టూ ఎడ్లను డప్పు వాయిద్యాలతో ఊరేగిస్తారు.కొందరు మట్టితో ఎడ్లను,కాపాలదారుని ప్రతిమ లు తయారు చేసి గోడలకు జా జు తో పొలాలు గీసి వస్త్రం పెట్టి అలంకరణ చేసి పూజలు చేస్తారు.

Akhand Bhoomi News

error: Content is protected !!