కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని ప్రతి వినాయక మండపానికి కె.వి ఆర్.ఆర్లడ్డు ప్రసాదం కె.వి ఆర్.ఆర్లడ్డు ప్రసాదం

 

కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని ప్రతి వినాయక మండపానికి కె.వి ఆర్.ఆర్లడ్డు ప్రసాదం

ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా ఎమ్మెల్యే కాటిపల్లి వేంకట రమణ రెడ్డి గారు లడ్డూల పంపిణీ*చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు 3000 మండపలకు పంపిణీ వరుసగా 6 వ సంవత్సరం పంపిణీకి ఏర్పాట్లుకామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 1 (అఖండ భూమి).బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి.కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 1 (అఖండ భూమి):కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు పంపిణీ చేసే లడ్డు ప్రసాద తయారి పూజా కార్యక్రమం బీజేపీ పట్టణ అద్యక్షుడు భరత్, బీజేపీ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి లు చేయటం జరిగింది.

 

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని ప్రతి వినాయక మండపానికి KVR లడ్డు ప్రసాదం అందజేయటం జరుగుతుందని, నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసే వినాయక మండపలకు చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు 3000 మండపలకు పంపిణీ చేస్తామని, వరుసగా 6 వ సంవత్సరం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. హిందువులు జరుపుకునే పండగలను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు గత 6 సంవత్సరాలుగా వినాయక మండపాలకు లడ్డు, దుర్గా మాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మ వారికి చీర, శ్రీరామ నవమి కి శోభాయాత్ర, మాహ శివరాత్రి సందర్భంగా జాగరణ , ఉగాది పర్వదినం సందర్భంగా యెడ్ల బండి ఏర్పాటు ఇలా ప్రతి పండగలో అన్నిటికీ ముందుండి తానై నడిపిస్తున్నారని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!