అనపర్తి నియోజకవర్గం ఎస్ ముక్తేశ్వరం, సింహపురం గ్రామాలలో ఎస్సీల కుట్రపూరిత వ్యతిరేక గర్జన (రాక్స్) అధినేత డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పర్యటించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ అనేక రోజులుగా అనేక గ్రామాల్లో పర్యటిస్తూ వర్గీకరణ నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ నిత్యం ప్రజల్లో తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎస్సీలలో అనూహ్య వర్గీకరణ చిచ్చుపెట్టి అనేక అవరోధాలను సృష్టిస్తున్న ప్రభుత్వాలు చేసే కుట్రలను గూర్చి వివరిస్తూ వర్గీకరణను ఆపే దిశగా ఉద్యమానికి సన్నద్ధం చేస్తున్నారు. ఆయనకు యువకులు, మహిళలు, దళిత నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమాలలో అనేకమంది యువకులు మహిళలు, పెద్దలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


