ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా..

 

 

ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా..

-దొడ్ల సత్యం జిపి స్థలంలో వేసుకున్న గోడను తొలగించాలని డిమాండ్..

-రేపు సమస్యను పరిష్కరిస్తామని ఎంపీఓ శ్రీనివాస్ హామీ..

-శాంతించిన గురడి రెడ్డి కాపు సంఘం పెద్దలు..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్: 21 (అఖండ భూమి) ఆలూరు మండలంలోని దేగాం గురడి రెడ్డి కాపు సంఘం గోడను ఆనుకొని ఉన్న గ్రామపంచాయతీ కి సంబంధించిన ఐదున్నర ఫీట్ల స్థలాన్ని దొడ్ల సత్యమనే అతను కబ్జా చేసి గోడను నిర్మాణం చేసి మొర్రం వేయడంతో వర్షం నీళ్లు నిలిచి గురడి కాపు సంఘం ప్రహరీ గోడ కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఈ విషయంపై జిల్లా డిఎల్పిఓ. ఆర్మూర్ ఎంపిఓకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం గురడి రెడ్డి కాపు సంఘం పెద్దలు మాట్లాడుతూ గత నెలలో సమస్యను పరిష్కరిస్తామని డిఎల్పిఓ. ఎంపీవోలు హామీ ఇచ్చి ఇంతవరకు సమస్య పరిష్కరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంపీఓ కు వివరణ కోరితే మంగళవారం రోజు డిఎల్పిఓ తో కలిసి శాశ్వత పరిష్కారం చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ధర్నాలో గురడి రెడ్డి కాపు సంఘం పెద్దలు పోతు ఎర్రన్న. ఆకిడి శ్రీనివాస్. పడిగెల రాజారెడ్డి. లోక గంగారెడ్డి. గడ్డం భూపతిరెడ్డి. సిహెచ్ హనుమాన్లు. సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!