కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
బెల్లంపల్లి అక్టోబర్ 23{అఖండ భూమి}: కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో కొత్తపల్లి వెంకటలక్ష్మి- చంద్రయ్య మెమోరియల్ సర్వీస్ సొసైటీ వారి ఆధర్వంలో ప్రతి మంగవారం నిర్వహించే ఉచిత కంటి పరీక్షలో ఎంపికైన క్యటరక్ట్ పేషంట్లను సొసైటీ ఖర్చులతో రవాణా, అలాగే భోజన సదుపాయం కల్పించి బుధవారం రోజున 11 మందికి ఆపరేషన్ కోసం బెల్లంపల్లి లయన్స్ కంటి ఆస్పత్రికి పంపించిన డా.కొత్తపల్లి శ్రీనివాస్,డా.కొత్తపల్లి అనిత అనంతరం డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… గత తొమ్మిది సంవత్సరాలలో వేల మందికి ఆపరేషన్ చేయించామని,ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆపరేషన్ చేయించికొని లబ్ధి పొందిన వారు మరి కొంతమందినీ ప్రోత్సహించాలని కోరారు.
ఐ క్యాంప్ ఇన్చార్జి గోపి కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…


