నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన గిరిజన ఆనిముత్యం
మానేపల్లి శిరీషను శాలువాతో సన్మానించిన గొల్లపల్లి ఎంపిటిసి బొమ్మెన హరీష్ గౌడ్
బెల్లంపల్లి అక్టోబర్ 23{అఖండ భూమి}:మట్టిలో మాణిక్యం నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామానికి చెందిన గిరిజన ఆడబిడ్డ మానేపల్లి శిరీష కు అభినందనలు తెలుపుతూ,శాలువాతో సన్మానించి చదువు ఖర్చులకు గాను తన వంతు ఆర్థిక సహాయం చేసిన గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ బొమ్మెన హరీష్ గౌడ్, అయన మాట్లాడుతూ…నిరుపేద కుటుంబం నుండి వెరిసిన గిరిజన ఆడబిడ్డ గురించి మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందేలా చూస్తామని హామీ ఇస్తూ..కఠోర కృషి,పట్టుదల ఉంటే ఏదైన సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు.గిరిజన ఆడ బిడ్డలు మట్టి లో మాణిక్యాళ్లగా వెలుగొందుతూ తమ తెగకు అలాగే వారి తల్లి దండ్రులకు తగిన గౌరవాన్ని తీసుకువస్తున్నా గిరిజన ఆడబిడ్డలకి అభినందనలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో నెన్నెల మండల మాజీ ఎంపీపీ బొమ్మెన దేవి,ఈగం లక్ష్మి,తది తరులు పాల్గొన్నారు…