గ్రూపులల్లో ఛానల్లల్లో తప్పుడు ప్రచార మెసేజ్ లు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు
బెల్లంపల్లి ఏసిపీ,ఏ. రవికుమార్..
బెల్లంపల్లి అక్టోబర్ 23{అఖండ భూమి}:ఈ నెల 15 తారీఖు రోజున బెల్లంపల్లి మండలం లోని బట్వాన్
పల్లి గ్రామం లో సింగతి నరేందర్,సింగతి మల్లేశం ల మధ్యన జరిగిన చిన్న భూమి తగాద వలన ఒకరినొకరు కొట్టుకొని తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ లో ధరఖాస్తులు ఇచ్చుకొనగా,ఇరువురి పై కేసులు నమోదు చేయగా, తర్వాత ఇట్టి గొడవకు సంబందించిన ఫోటోలను సింగతి నరేందర్ యూట్యూబ్, ఫేస్ బుక్ లలో అప్లోడ్ చేసుకోగా,తర్వాత చిలుక ప్రవీణ్ కుమార్,యూట్యూబర్ నివాసం,ధర్మసాగర్ అనే వ్యక్తి పై సంఘటనను వక్రీకరించి రెండు వర్గాల మద్య,రెండు రాజకీయ పార్టీల మద్యన విద్వేషాలు పెంచే విదంగ,బి ఆర్ఎస్ పార్టీ కి ఓటు వేసినందుకు కాంగ్రెస్ పార్టీ వారు నరేందర్ పై గొడ్డలితో దాడి చేసినారని తప్పుడు సమాచారాన్ని ట్విటర్,లో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తునందుకుగాను చిలుక ప్రవీణ్ కుమార్ యూట్యూబర్, అనునతని పై తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నమ్మన్నారు.తదుపరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రెండు వర్గాల మద్య సోషల్ మీడియాల లో విద్వేషాలు సృటిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసిపీ,ఏ.రవికుమార్, తెలియజేశారు…