పిఠాపురం నియోజకవర్గం జగపతి రాజ పురం గ్రామంలో డ్రెయిన్ లో పలుచోట్ల పూడిక పేరుకుపోయింది. చాలా కాలంగా పూడిక పేరుకుపోయి, మురుగునీరు సరిగ్గా దిగక, అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా, దుర్వాసన వెదజల్లుతుంది.దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అంతే కాకుండా నిల్వ నీటి పై దోమలు, వృద్ధి చెందడం తో అనేక మంది మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ లాంటి అనేక వ్యాధుల బారిన పడ్డారు. గ్రామస్తులు విషయాన్ని ఆ గ్రామం లోని వార్డు మెంబర్ మడికి బాబ్జి దృష్టికి తీసుకెళ్లడం తో గ్రామ ప్రజల ఇబ్బందిని గుర్తించి తానే స్వయంగా డ్రైనేజీలో పేరుకు పోయిన పూడికను తొలగించి శుభ్రపరచారు.దీనితో సమస్య పరిష్కారమయింది. ఎప్పటినుండో ఉన్న సమస్య పరిష్కారం కావడం పట్ల పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
You may also like
-
తప్పుడు సర్వే నివేదికలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలి. న్యాయవాది కొండ్రు కళ్యాణ్
-
ఎస్సీల కుల గణన లిస్ట్ లో అన్నీ తప్పులే – అభ్యంతరం తెలియజేసిన ఎస్సీ నాయకులు
-
మాదిగ హక్కుల దండోరా జిల్లా ముఖ్య నాయకుల సమావేశం
-
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి
-
చోరీ కేసులో నిందితుల అరెస్టు.. రిమాండ్ కు తరలింపు