పసి ప్రాణం మింగిన మున్సిపల్ డ్రైనేజీ..

-రాంనగర్ కాలనీలో విషాదఛాయలు..

-మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే అంటున్న కాలనీ వాసులు..

-ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపణ..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 28 (అఖండ భూమి) ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ. వార్డు రాంనగర్ కాలనీలో నివాసముంటున్న మట్ట ప్రశాంత్ ఆటో డ్రైవర్ కు ఓకే ఒక సంతానమైన ధనశ్రీ (3) సంవత్సరాల పాప గురువారం ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఎదురుగా ఉన్న మున్సిపల్ ఏడు ఫీట్ల మోకాలు ఎత్తు మురికి నీరు ఉన్న డ్రైనేజీ లో పడి మురికి నీరు మింగి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాప మృతికి మున్సిపల్ అధికారులే కారణం అంటూ ఆగ్రహిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో పసిపాప మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. పాప మృతికి మున్సిపల్ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!