- అర్హులైన లబ్ధిదారులకే పథకాలు..
నిజామాబాద్ జిల్లా బాల్కొండ ప్రతినిధి జనవరి: 21 (అఖండ భూమి న్యూస్) భీమ్గల్.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరేలా చేస్తామని గంగుల సంతోష్ కుమార్, తహసిల్దార్ మహ్మద్ షబ్బీర్ అన్నారు. భీమ్‌గల్ మండలంలోని గ్రామాల్లో మంగళవారం పల్లికొండ, లింగపూర్, గోన్ గూప్పుల, చేంగల్, సంతోష్ నగర్ తండా పీకే తండా దేవక్కపేట్, తాళ్లపల్లి తండాలలో గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, తహసిల్దార్ మాట్లాడుతూ. రైతు భరోసా. ఇందిరమ్మ. ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఇండ్లు. రేషన్ కార్డుల జాబితా గ్రామ సభలలో ప్రజల సంక్షేమం గురించి ఆయన వినిపించారు. ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉంటే జాబితా లో పేరు రాని వారికి ప్రత్యేక కౌంటర్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో జావేద్ అలి, డీటీ లు శ్రీనివాస్ ఎలక్షన్ డీటీ అశ్విన్, భీమ్ రావు. వ్యవసాయ అధికారులు. రెవెన్యూ అధికారులు. పంచాయితీ కార్యదర్శులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు..