సర్వ సమాజ్ కమిటీ నూతన అధ్యక్షునిగా నీలం రవి

 

 

సర్వ సమాజ్ కమిటీ నూతన అధ్యక్షునిగా నీలం రవి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి జనవరి 21 (అఖండ భూమి న్యూస్) భీంగల్ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నీలం రవి, ఉపాధ్యక్షునిగా బర్ల బేల్దారి గంగా మోహన్, కోశాధికారిగా కాపు కుమ్మరి హరీష్, ప్రధాన కార్యదర్శి (రైటర్) గా పర్స నవీన్ లను గత సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నూతన సర్వ సమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ. మాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులను స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు.నూతన కార్యవర్గ సభ్యులకు పట్టణవాసులు, ఆత్మీయ మిత్రులు, అభిమానులు, నాయకులు, శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు…

Akhand Bhoomi News

error: Content is protected !!