31వ వార్డుసభను ప్రారంభించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
బెల్లంపల్లి జనవరి 23(అఖండ భూమి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా ప్రవేశ పెట్టిన 4పథకాలలో భాగంగా గురువారం రోజునా బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డ్ లో ఏర్పాటు చేసిన వార్డ్ సభను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ…అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిలర్ గెల్లి రాజలింగు మాట్లాడుతూ..ఇంకా పేరు నమోదు చేయని వారు,పేరు రానివారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని,ఈ కార్యక్రమం ప్రతిరోజూ జరుగుతుంది అని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ఆర్డిఓ హరికృష్ణ,మున్సిపల్ ఛైర్మెన్ జక్కులశ్వేతా,బెల్లంపల్లి పట్టణం ముచర్ల మల్లయ్య,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు,వార్డ్ కౌన్సిలర్ గెల్లి రాజలింగు,వార్డ్ ఆఫీసర్ మోహన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లెంకల శ్రీనివాస్, ఆర్పి రమణ, రామకృష్ణ, రంజిత్, గెల్లి రమాకాంత్, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు…