తాండూర్ ఐబి కేంద్రంలో సిపిఎం పార్టీ వాల్ పోస్టర్స్ విడుదల
బెల్లంపల్లి జనవరి 23(అఖండ భూమి) జనవరి 25 నుండి 28 వరకు జరిగే సిపిఎం పార్టీ 4.వ తెలంగాణ రాష్ట్ర మహాసభలను 25న జరిగే లక్షలాది మంది తోటి సంగారెడ్డి పట్టణంలోని పి ఎస్ఆర్ గ్రౌండ్ లో బహిరంగ సభను మంచిర్యాల జిల్లాలోని వేలాదిమంది ప్రజలు విజయవంతం చేయవలసిందిగా సిపిఎం పార్టీ కోరుతుంది.
ఈ మహాసభలకు దేశంలోని సిపిఎం పార్టీ అగ్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు.
దాగం రాజారామ్ సిపిఎం పార్టీ మంచిర్యాల్ జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ…ఉద్యమాల దిక్సూచి, పోరాటాల సారధి,కష్టజీవుల గొంతుక సిపిఎం రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న అక్కడ,ఆప్రజల పక్షాన నికరంగా నిలబడే పోరుకెరటం తెలంగాణ ఏర్పడి దశబ్ద కాలం గడిచిన ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు కొలువులు రాక నిరుద్యోగ యువత ఎదురుచూపులు చూస్తుంది.కూలీలు,అసంఘటిత రంగ కార్మికుల బతుకులు దయనీయంగా ఉన్నాయి.కౌలు రైతులను గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధపడలేదు.వృత్తిదారులు సమస్యల ఊబిలో కూరుకుపోయినారు. ఒక్కరేమిటి అన్నిరంగాల ప్రజలు సంక్షో భంలో ఉన్నారు.నిరంకుశంగా పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి ఆరు గ్యారెంటీలు,అనేక వాగ్దానాలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రభుత్వ మారింది తప్ప ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు.పేదలు తల దాచుకోవడానికి జానెడు జాగా లేక అల్లాడిపోతుంటే ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేసింది సిపిఎం. నేటికీ అనేక జిల్లాలలో పోరాడుతున్నది, భూ పోరాటం నడిపింది, ప్రభుత్వ భూములను పేదలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీసింది,నిర్వాసితులకు అండగా నిలిచింది.ఓడు సాగుదారు హక్కు పత్రాల సాధన పోరాటంలో అగ్ర భాగాన నిలిచింది ఆదివాసీల అటవీ హక్కులకై పోరాటం చేసింది.కార్మిక హక్కుల రక్షణ కోసం,రైతందానికి ఇచ్చిన హామీల అమలు కోసం,అందరికీ ఉచిత ఆరోగ్యాన్ని అందించే ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం కోసం,వ్యవసాయ కూలీల, అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతన చట్టాల అమలు కోసం,ప్రజలను సమీకరించి ఉద్యమాల సారధిగా సిపిఎం పార్టీ నిలబడ్డది కేంద్రంలో మోడీ సర్కారు నూతన ఆర్థిక విధానాలను,నయా ఉద్దరవాద విధానాలను చాలా వేగవంతంగా అమలు చేస్తుంది. కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతున్నది.అంబానీ,ఆదానీలా సర్కార్ గా మోడీ సర్కార్ మారింది. ఇందులో భాగమే ఆదాని లంచాల బాగోతం,ప్రజల్ని ఇక్కట్ల పాలు చేస్తు అసమానతలను పెంచుతుంది. పెట్రోల్, డీజిల్,గ్యాస్,రోజువారి వాడుకునే సరుకుల ధరలు విపరీతంగా పెంచి బతకలేని దుర్మార్గ స్థితిలోకి ప్రజలను నెట్టేస్తున్నది.మన మూల్గాలను పీల్చి కార్పొరేట్లు బలి చేసేలా చేస్తున్నది. ప్రజలను ఆ భద్రతలోకి నెట్టేస్తుంది. వికాసిత భారత్ అంటూ అందమైన పదాలు చెబుతూ ప్రజలను సమస్యల ఊబిలో ముంచేస్తున్నది.ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పోరేట్లకు దోచిపెడుతున్నది.అవినీతి,ఆశ్రిత పక్షపాతంతో దేశాన్ని పాలకులు కబలిస్తున్నారు.దీనితో పేదల్లోనే కాకుండా మధ్యతరగతి,ఉద్యోగులు కూడా ఇబ్బందులకు గురి అవుతున్నారు.
తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ప్రజలు ధరల పెరుగుదల,నిరుద్యోగ్యం,ఉపాధి సమస్యలతో సతమతమవుతుంటే, ప్రజల అసంతృప్తి తమకు వ్యతిరేకంగా మారకుండా మతోన్మాదాన్ని,కులో ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది,కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులు, ఆదివాసీలు,మహిళలు,మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని హోం మంత్రిత్వ శాఖ లెక్కలే చెప్తున్నాయి. మతంపేరా,కులంపేరా విద్వేషాలు పెంపొందిస్తున్నది.నేరస్తులు మైనార్టీ మతాలకు చెందిన వారు అయినప్పుడు మాత్రమే స్పందిస్తూ మతం రంగు పులిమి ఘర్షణలు సృష్టిస్తున్నారు.ఈ కార్యక్రమం లో టీ.మల్లేష్ ఐ.మల్లేష్,ఐ.బాణేష్,సీ హెచ్.లక్ష్మణ్, కే.శంకర్,డి.వెంకటేశం, కే.బాపు,ఏ.శంకర్,కే.రాములు,ఎస్.పోశయ్య,టీ.శ్రీను, ఆర్.బాపు,సి హెచ్.దుర్గయ్య,పి.బుచ్చయ్య,సి హెచ్.రవీందర్,సి హెచ్.తిరుపతి తమ్మిన నేని శ్రీను,పి.రాగులయ్య.తోగరీ.శ్రీను లింగయ్య, కే.స్వామి, ఎం.జగదీష్,ఏ.శ్రీనివాస్,ఎం.సుధాకర్,ఎం తిరుపతి,బి.శంకర్, పి.రాజన్న, కే.మల్లేష్, పి.లింగయ్య, కే.చందు,బి.చందు,వేల్పుల శంకర్.దుర్గం నాన్నయ్య తదితరులు పాల్గొన్నారు…