హత్య రాజకీయాలు ఉద్యోగులపై వద్దు… ఏపీవో లక్ష్మన్న
కలిసి పని చేసుకోవడమే ముద్దు..
ముక్తకంఠంతో ఖండించిన ఉపాధి హామీ పథకం సిబ్బంది.
వెల్దుర్తి అఖండ భూమి వెబ్ న్యూస్ : గ్రామాలలో ఉన్నటువంటి హత్య రాజకీయాలు ఉపాధి సిబ్బందులపై చూపకూడదని.. వెల్దుర్తి మండల ఏపీవో లక్ష్మన్న, ఈసీ పృధ్విరాజ్ ముక్తకంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి ఉపాధి సిబ్బందితో బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశారు. మృతి చెందిన ఆలూరు మండలం హరిగేరి గ్రామపంచాయతీకి చెందిన ఈరన్న మృతిని ఖండించారు. ఈ సందర్భంగా ఉపాధి సిబ్బందితో మాట్లాడుతూ.. గ్రామాలలో హత్య రాజకీయాలకు తావుండకుండా అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



