నేటి నుండి మున్సిపల్ లో ప్రత్యేక అధికారుల పాలన..

 

నేటి నుండి మున్సిపల్ లో ప్రత్యేక అధికారుల పాలన..

-కొలువుదీరిన కౌన్సిలర్ల పదవీకాలం..

-కమిషనర్లే నేనే రాజు.. నేనే మంత్రి..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి: 26 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్..2025 జనవరి 26 నాడు జాతీయ జెండాను ఎగరవేసిన చైర్ పర్సన్.. చైర్మన్ల పదవీకాలం ముగియడంతో 27 నుండి మున్సిపల్ లలో ఆర్డిఓ.. కమిషనర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించాలని మున్సిపల్ ప్రిన్సిపుల్ సెక్రటరీ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. నేటినుండి కమిషనర్లే నేనే రాజు.. నేనే మంత్రిగా వ్యవహరించనున్నారు. కౌన్సిలర్ల పదవీకాలం ముగియడంతో ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడి రాక నారాజ్ గా ఉన్నారని తెలిసింది. కౌన్సిలర్లకు ఏడదిన్నర కాటు వేసిందని స్వయానా కౌన్సిలర్లే చెబుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో గత చైర్పర్సన్ పండిత్ వినీత పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో వినీత అవిశ్వాసం నెగ్గక.. 10 నెలల కోసం వన్నెల్ దేవీ లావణ్యను చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. చైర్ పర్సన్ భర్త అయ్యప్ప శ్రీనివాస్ పదవి కోసం రెండు కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం.. చేసిన పది నెలల కాలంలో పెట్టిన పెట్టుబడి రాక నెత్తి పై తడి బట్ట వేసుకున్నట్టయింది.

Akhand Bhoomi News

error: Content is protected !!