10 పరీక్షలలో 38.98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత 

10 పరీక్షలలో 38.98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత

మండల టాపర్ గా హాస్టల్ విద్యార్థి కిషోర్

తుగ్గలి మే 6 (అఖండ భూమి) :

పదవ తరగతి పరీక్షల లో మండలం లో 38.98 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని 11 పాఠశాల లో 567 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు. అందులో కేవలం 221 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పగిడిరాయి జెడ్పీ పాఠశాల లో 73.47 శాత మంది విద్యార్థులు ఉత్తీర్త సాధించడం తో మండలం లో టాపర్ గా ఆ పాఠశాల నిలిచింది .అలాగే రాతన గిరిజన గురుకుల పాఠశాలలో కేవలం 10 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించి చివరి స్థానంలో నిలిచింది. మండల టాపర్ గా జొన్నగిరి జెడ్పి పాఠశాల లో హాస్టల్లో చదువుతున్న విద్యార్థి పి కిషోర్ 532 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచారు. అలాగే తుగ్గలి నోవీ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి జె. భరాని 522 మార్కులు సాధించి ద్వితీయ స్థానం లో ,అలాగే పెండేకల్ జడ్పీ పాఠశాల విద్యార్థి గీత దీపిక 520 మార్కులు సాధించి మూడో స్థానం సాధించారు. పగిడి రాయి జడ్పీ పాఠశాల లో 73.47 శాతం మంది విద్యార్థులు, రాతన ఆశ్రమ పాఠశాల లో 61.90 శాతం, జొన్నగిరి జెడ్పి పాఠశాల లో 60 శాతం, కేజీబీవీ తుగ్గలి లో 42.86 శాతం, తుగ్గలి జడ్పీ పాఠశాల లో 26.42 శాతం, పెండేకల్ జడ్పీ పాఠశాల లో 19.73 శాతం, రాతన జడ్పీ పాఠశాల లో 14.81 శాతం, ఎద్దులదొడ్డి, రామలింగయ్య పల్లి జడ్పీ పాఠశాల లలో 14.29 శాతం ,రాతన గురుకుల రెసిడెన్షియల్ లో 10 శాతం, తుగ్గలి నోవీ ప్రైవేట్ స్కూల్లో 90.48 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రాతన లోని గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో కేవలం 10 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్త సాధించడం పట్ల ఉపాధ్యాయుల పై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. జిల్లా గిరిజన శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సక్రమంగా విద్యార్థులకు విద్యను బోధించకపోవడం వల్లే 10 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతం లో ఈ పాఠశాల పై అనేక ఫిర్యాదులు అందడం తో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ తనిఖీ చేసి ఉపాధ్యాయుల పై ఆగ్రహం చెందడం కూడా జరిగింది. అయితే ఈ పాఠశాలను పర్యవేక్షణ చేయవలసిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ పాఠశాలపై పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఈ పాఠశాల లో ఉపాధ్యాయులు విద్యను బోధించడం లేదని పలువులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందువల్ల జిల్లా కలెక్టర్ స్పందించి పాఠశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ఉపాధ్యాయులు విధులకు గైరాజరం కావడం వాటిపై విచారణ చేయాలని, అలాగే పర్యవేక్షణ చేయడంలో విఫలమైన జిల్లా గిరిజన ఉన్నతాధికారుల పై కూడా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!