filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 32768;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;

గ్రామంలో మద్యం ఏరులై పారుతున్న వైనం..

 

గ్రామంలో మద్యం ఏరులై పారుతున్న వైనం..

చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు..

పెద్దమ్మ దేవరకు సర్వం సిద్ధం చేసిన గ్రామస్తులు…

అడుగడుగునా మూగజీవాలు బలి..

బూత్ పిల్లి వేషానికి సశే మీరా అంటున్న గ్రామస్తులు..

వెల్దుర్తి ఫిబ్రవరి 18 అఖండ భూమి వెబ్ న్యూస్ :

మండల పరిధిలోని ఎల్. బండ గ్రామంలో పెద్దమ్మ దేవరకు సర్వం సిద్ధం చేసినట్లు గ్రామ పెద్దమ్మ దేవర నిర్వాకులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎల్లమ్మ, సుంకులమ్మ, పెద్దమ్మ, మారెమ్మ ఆలయాలను ముస్తాబ్ చేశారు. ఈ దేవవర దాదాపు 30 సంవత్సరాల తర్వాత పెద్దమ్మ దేవర జరుపుకోవడం గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవర సందర్భంగా మూగజీవాలను బలిదానం చేసేందుకు గ్రామస్తులంతా సిద్ధమయ్యారు. గ్రామంలో మద్యం ఏరులై మారనున్న వైనం. సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గ్రామ పొలిమేర నందు అడుగడుగునా మూగజీవాలను బలి చేసి రక్తార్పణం గ్రామంలో జరగబోతున్నట్లు సమాచారం.

దీంతోపాటు గ్రామంలో పేకాట, గుడుగుడు ఆట, ఆ సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వనీయత సమాచారం. దేవుళ్ళ పేర్లు చెప్పి దేవరలో బూత్ పిల్లి వేషధారణలో వ్యక్తి సంచరించడం జరుగుతుంది. దీనికి కొంతమంది గ్రామస్తులు ససేమిరా అన్నారు. దీంతో గొడవలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గొడవలకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గ్రామస్తులు తెలుపుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!