బెల్లంపల్లి యూనియన్ బ్యాంక్లో ఏర్పాటుచేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని సంబంధిత అధికారులు తక్షణమే పర్యవేక్షించాలి

 

బెల్లంపల్లి యూనియన్ బ్యాంక్లో ఏర్పాటుచేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని సంబంధిత అధికారులు తక్షణమే పర్యవేక్షించాలి

బెల్లంపల్లి ఫిబ్రవరి 20(అఖండ భూమి న్యూస్ ):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం మీసేవ కార్యక్రమాలు వివిధ బ్రాంచిలలో యూనియన్ బ్యాంక్ లో జరుగుతున్నా నిర్లక్ష్యాన్ని ఉద్దేశించి ప్రజాస్వామ్య కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యుడు అంబాలా మహేందర్ మాట్లాడుతూ…విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి ఆధర్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది.కానీ విద్యార్థిని విద్యార్థులను అప్డేట్ చేయడానికి నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కనీసం డేట్ అఫ్ బర్త్ చేంజ్ గాని ఇతరత్రా తప్పులు ఉన్నచో సరి చేయడానికి ఏమేమి కావాలి అనే చార్ట్ కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఆ సర్టిఫికెట్ లేదు ఈ సర్టిఫికెట్ లేదని సాకులు చెబుతూ రేపు రండి మాపు రండి అని ఇంటికి పంపడం జరుగుతున్నది దీని ద్వారా విద్యార్థిని విద్యార్థులు మరి ముఖ్యంగా హాస్టల్ నుండి వచ్చిన విద్యార్థులు తమ తమ విద్యను కోల్పోతున్నారన్నారు.
ఇప్పటికైనా యూనియన్ బ్యాంకులో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రంలో చార్ట్ పెట్టగలని డిమాండ్ చేస్తున్నామన్నారు.లేనిపక్షంలో సంబంధిత జిల్లా పాలన అధికారికి తెలియజేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!