ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సీజ్
బెల్లంపల్లి ఫిబ్రవరి 20 అఖండ భూమి వెబ్ న్యూస్ :మంచిర్యాల జిల్లా పెర్కపల్లి గ్రామం గురువారం పోలీస్ వారికీ నమ్మదగిన సమాచారం మేరకు పెరకపల్లి గ్రామ శివారులో రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని బెల్లంపల్లి 3టౌన్ ఎస్ఐ సీహెచ్.రమేష్ వెల్లడించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…గురువారం ఉదయం 6:30 నిమిషాలకు అలాగే 08:30 గంటలకు రెండు ట్రాక్టర్లలతో ఇసుక తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు అట్టి ట్రాక్టర్ లను సీజ్ చేయడం జరిగిందని బెల్లంపల్లి 3టౌన్ ఎస్ఐ సీ హెచ్.రమేష్ వెల్లడించారు.ఇట్టి ట్రాక్టర్ లు గుండ్ల సోమవారం గ్రామానికి చెందిన దుగుట కుమార్,నివాసం గుండ్ల సోమవారం గ్రామం నెన్నెల మండల్, తైదల విశ్వనాథ్,గుండ్ల సోమవారం నివాసులు అనువారు వారి యొక్క ట్రాక్టర్లు గుండ్ల సోమవారం గ్రామ శివారులో గల వాగులోనుండి ఇసుకను దొంగతనంగ ట్రాక్టర్ లల్లో నింపుకొని పెర్క పల్లిలో కావాల్సిన వారికి డంపింగ్ చేయడం కోసం తరలిస్తున్న క్రమంలో సమాచారం రాగా వచ్చిన సమాచారం మేరకు ఆరెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను దొంగలించి తరలించినట్లయితే వారి పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా బెల్లంపల్లి 3టౌన్ ఎస్ఐ సీ హెచ్. రమేష్ తెలియజేశారు…