శ్రీశైల దేవస్థానంశ్రీ కాళహస్తి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ 

 

 

శ్రీశైల దేవస్థానంశ్రీ కాళహస్తి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ

నంద్యాల జిల్లా శ్రీశైలం,19 అఖండ భూమి వెబ్ న్యూస్ :

శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు ఈ రోజు 19,2 -రాత్రి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.

శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున ఆ దేవస్థానం ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్. ఆర్. కృష్ణారెడ్డి ఈ పట్టువస్త్రాలను సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమములో శ్రీకాళహస్తీశ్వరస్వాటవార్ల దేవస్థానం ప్రధానార్చకులు సంబంధం గురుకుల ము అర్చకులు, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసులు, అధికారులు, అర్చకులు, వేదపండితులు, కాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికాడు.

అనంతరం శ్రీకాళహన్ని దేవస్థానం అధికారులు మరియు వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఉపకార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!