ఆధునిక యుగములోనూ గిరిజనులకు కలుషిత నీరే గతి

 

 

 

జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీరు అందించాలి

కొయ్యూరు అల్లూరి జిల్లా

మార్చి 20(అఖండ భూమి)

తరాలు మారుతున్న తమ తలరాతలు మాత్రం మారడం లేదని ఆదివాసి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర సిద్ధించి 78 ఏళ్లు గడచిన కొయ్యూరు మండలం మటం భీమవరం పంచాయతీ పరిధిలో గల చీడికోట గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు, పాలకులు అధికారులు విఫలమయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి మారుమూల గ్రామానికి జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించాలని సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఊ పథకాన్ని ప్రవేశపెట్టిన కానిఈ ప్రాంతంలో మాత్రం అమలు కావడం లేదన్నారు. దీంతో కొండ కోనల్లో ప్రవహించి ఊటనీరును గిరిజనులు సేవించి అనారోగ్యాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా కొక్కోల్లలగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలు పాలకులు అధికారులు మాత్రం గిరిజనులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఊక దంపుడు ప్రసంగాలు గుప్పిస్తారు కానీ తామంతా ఇలాంటి కలుషిత నీరును జీవించడం వలన ఎలా ఆరోగ్యవంతంగా ఉంటామని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతం నుండి ఎన్నికవుతున్న ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు తమలాంటి మారు మూల గ్రామాల ప్రజల గురించి కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి చీడికోటతో పాటు అనేక మారుమూల గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించి ఆదివాసి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.. లేకుంటే మండల కార్యాలయం వద్ద చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా గ్రామస్తులు అంతా శాంతియుతంగా సమస్య పరిష్కరించే అంతవరకు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు

Akhand Bhoomi News

error: Content is protected !!