అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు

 

అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేటు

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల ప్రతినిధి మార్చి 20 (అఖండ భూమి పెబ్ న్యూస్) :

ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సాంఘిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్ యం. బొజ్జన్న ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.*

*ప్యాపిలి మండలంలోని ఏనుగుమర్రి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సాంఘిక శాస్త్ర స్కూల్ అసిస్టెంట్ యం. బొజ్జన్న విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో వెళ్లడైనందున సంబంధిత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడమే కాకుండా విద్యార్థుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి తమ నివేదికల్లో వెల్లడించినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు స్కూల్ అసిస్టెంట్ యం. బొజ్జన్నపై తగు చర్యలు తీసుకోవాలని వ్రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసినట్లు నివేదికలో తెలిపారన్నారు. పాఠశాల విద్యార్ధినులను విచారించగా స్కూల్ అసిస్టెంట్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలియజేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. గతంలో పాఠశాల హెడ్మాస్టర్ స్కూల్ అసిస్టెంట్ ను తన ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తల్లో మార్పు రాకపోవడం విచారకరమని నివేదికలో వెల్లడైనట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్ధినులపై స్కూల్ అసిస్టెంట్ యం.బొజ్జన్న ప్రవర్తన సరిగా లేని కారణంగా ఉపాధ్యాయుల నీతి, నియమావళి (RTE Act, Section 17) ని ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయినందున సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!