___ ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమం: జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్.రత్నాకర్

___ ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమం: జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్.రత్నాకర్
అడ్డుకోని మాల ప్రజా ప్రతినిధులకు
రాక్స్ సంతాపం

కాకినాడ,

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు (రాక్స్) ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు.ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకుండా మౌనంగా ఉండి పదవులను అనుభవిస్తున్న ప్రజా ప్రతినిధులు చనిపోయినట్టేనని కొవ్వొత్తి వెలిగించి సంతాపం వ్యక్తం చేశారు.
బుధవారం కాకినాడ అంబేద్కర్ భవనంలో ఆర్ఎస్ .రత్నాకర్ విలేకరులతో సమావేశం నిర్వహించారు.ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామంటూ చంద్రబాబు తప్పు చేస్తున్నారని ఇది దేశవ్యాప్తంగా ఎస్సీలను అనగదొక్కేందుకు కుట్రని ఇది చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. ఎటువంటి సంఖ్యా కొలమానం లేకుండా ఎస్సీ సామాజిక వర్గాలను విభజించడం తగదన్నారు.ఎస్సీ కులాల మధ్య వివాదాలు రేపేందుకు కేంద్ర స్థాయిలో జరుగుతున్న కుట్రని దీన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, హరేవంత్ రెడ్డిలు గ్రహించాలని సూచించారు.తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఇద్దరు సీఎంలు విరమించుకోవాలని డిమాండు చేశారు.అలాగే ఇతర ఉత్తర,దక్షిణ భారతదేశంలో ఉన్న ఎస్సీలు దీనిపై పోరాడాలని ఈ ఉద్యమాలకు మద్దతుగా నిలవాలని ఆయా రాష్ట్రాల ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయా భాషల్లో రత్నాకర్ కోరారు.ముందుగా కలెక్టరు కార్యాలయం సమీపంలో గల ఇంద్రపాలెం వంతెన వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి ప్రధాని మోదీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,వర్గీకరణపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ భవనానికి చేరుకున్నారు.
ఈ సమావేశంలో మాలమహానాడు కార్యకర్తలు,రాక్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!