మృత్యు సొరంగం..?

 

మృత్యు సొరంగం..?

-మింగేందుకు సిద్ధం..?

-ఎవరు బలి అవుతారో..?

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి: 19 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్ పట్టణం గోల్ బంగ్లా 36వ. వార్డులో సిద్దుల గుట్ట పైకి మెట్ల మార్గంలో వెళ్లే దారిలో మున్సిపల్ డ్రైనేజీ కూలిపోయి మనుషులను మింగేందుకు సిద్ధంగా ఉంది. గత స్థానిక వార్డు కౌన్సిలర్ బారడ్ రమేష్ తన హయంలో ప్రమాదకరంగా ఉన్న కల్వర్టును నిర్మించాలని గత సంవత్సరం నుండి మున్సిపల్ చైర్పర్సన్.. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నించిన వారు స్పందించకపోవడంతో వార్డ్ కౌన్సిలర్.. మాజీ అయ్యాడు కానీ కాలనీవాసులకు కల్వర్టు నిర్మాణం చేయలేకపోయానని మదనపడ్డా ఫలితం లేకుండా పోయింది. కాలనీ వాసులకు కూలిన డ్రైనేజ్ శాపంగా మారి కల్వర్టు నిర్మాణం జరగక ప్రమాదంగా మారడంతో కాలనీవాసులు ఎవరు ఎప్పుడు మృత్యువాత పడతారోనని ఆందోళన చెందుతున్నారు. గత 15 రోజుల క్రితం కాలనీవాసి స్కూటీ పై నుండి కింద పడడంతో ముఖానికి. కాలుకు తీవ్రంగా గాయాలవ్వడంతో స్థానికులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. కల్వర్టు నిర్మాణం చేయకపోతే మున్సిపల్ సిబ్బంది వార్డుకు రావద్దని. ఇకపై మున్సిపల్ కు ఆస్తి పన్ను చెల్లించేది లేదని మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో పట్టణంలో వైరల్ గా మారింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందిస్తారా.. లేక గత సంవత్సరం నవంబర్ 28న. రామ్ నగర్ లోని పెద్ద డ్రైనేజీలో మూడు సంవత్సరాల చిన్నారి మృతి చెందిన విధంగా.. ఎవరైనా మృత్యువాత పడితే గాని మున్సిపల్ అధికారులు స్పందించరా అని 36వ. వార్డు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే కల్వర్టు నిర్మాణం చేయాలని వాడు ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!