బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి …

పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావాలి…
, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 7 (అఖండ భూమి న్యూస్);
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న జరిగే టిఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో సన్నాహక సభ ఏర్పాట్ల గురించి చర్చించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గము నుండి 3000 మంది కార్యకర్తలు తరలించాలని నిర్ణయించారు. పార్టీ నిర్ణయించిన సంఖ్యకు తక్కువ కాకుండా ఎక్కువగా తరలించాలని సూచించారు. పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకొని 27న గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి సభకు బయలుదేరాలన్నారు. పండగ వాతావరణం లో పార్టీ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 1500 ఎకరాల్లో చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న సభ ను విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని ప్రధాన చౌరస్తాల్లో వాల్ పెయింటింగ్ .పార్టీ నినాదాలను వ్రాయించడం జరుగుతుందా అన్నారు. ఇప్పటినుండి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సభకు తరలిరావడానికి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని నాయకులకు సూచించారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాజీ జెడ్పిటిసిలు నిన్ను మినుకురి రాంరెడ్డి, గాండ్ర మధుసూదన్ రావు, మాజీ ఎంపీపీలు బాలమణి, పిప్పిరి ఆంజనేయులు, పార్టీ అధికార ప్రతినిధులు బలవంత రావు, గైని శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు జూకంటి మోహన్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్,, ప్రభాకర్ రెడ్డి, భానుతోపాటు ఆయా మండలం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


