విద్యార్థులు శిక్షణా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి – దక్షిణ ప్రాంగణం ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఏప్రిల్ 15 (ఆఖండ భూమి న్యూస్);
తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు (Soft skills, Basics of AI,Assistance for placements,), (మృదునైపుణ్యాలు, కృత్రిమ మేధా పై ప్రాథమిక అంశాలు, నియామకాలకై సహాయం) పై పది రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు సెమినార్ హాల్లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ శిక్షణను వినియోగించుకొని ఉద్యోగాలను పొందడానికి తగిన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు.
ఈ శిక్షణను మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ అనే ఎన్జీవో సహకారంతో నడుస్తుందన్నారు. ఉచితంగా ఇచ్చే ఈ శిక్షణను విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు.
నాణ్యత కలిగిన శిక్షణ ఇవ్వవలసిందిగా ఎన్జీవో ప్రతినిధులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎన్ మోహన్ బాబు, డాక్టర్ బి అంజయ్య, డాక్టర్ ఎల్ హరిత డాక్టర్ డి సబితా, డాక్టర్ జి లలిత మరియు డాక్టర్ టి ప్రతిజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
మ్యాజిక్ బస్ ఫౌండేషన్ నుండి సృజన్, సుప్రీతా, బాలకృష్ణ పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమం తప్పకుండా సరైన సమయానికి హాజరు కావలసిందిగా తెలిపారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



