17న బిబి పేటలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 15 (అఖండ భూమి న్యూస్);
వాసవి క్లబ్ బిబిపేట భవనంలో ఈనెల 17 గురువారం రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్ వి ఎం హాస్పిటల్, ములుగు వాసవి క్లబ్ బిబిపేట వీటి ఠాకూర్ మెమోరియల్ వారి సహకారంతో మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు బా శెట్టి నాగేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు , ఆరోగ్య శిబిరం కరపత్రికను గ్రామపంచాయతీ బీబీపేట ఆవరణలో వాసవి క్లబ్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్ పంచాయతీ కార్యదర్శి రమేష్, ఆర్ వి ఎం ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ సంతోష్, మురళి ఆవిష్కరించారు.
ఈ శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, వారికి ఉచితంగా మందులు, ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి మరుసటి రోజు వారి బస్సుల్లో ఆర్ వి ఎం ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్లు , పరీక్షలు నిర్వహించగలరు, ఈ సదవకాశాన్ని బిబిపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని ప్రకటన లో పేర్కొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


